Home

»

Latest News

Adivi sesh: పవన్ కళ్యాణ్ పై అడివిశేష్ వ్యాఖ్యలు వైరల్.. ఆ పార్టీలో జాయిన్ అవుతాడా అంటున్న ఫ్యాన్స్ 

May 18, 2026 11:41AM

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని అభిమానించే వారిలో ఇతర హీరోలు కూడా ఉంటారనే విషయం తెలిసిందే. అలాంటి వారిలో అడివి శేష్(Adivi Sesh)కూడా ఒకడు. ఇంకా చెప్పాలంటే అడివిశేష్ లైమ్ లైట్ లోకి వచ్చిందే పవన్ మూవీ పంజా నుంచి. ఆ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్  గురించి నేటికి ఇరువురి ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 

రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గురించి అడివిశేష్ మాట్లాడుతు   మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో తన నాయకత్వ లక్షణాలని నిరూపించుకుంటు  పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్న తీరు అద్భుతం. సామాన్యుల కష్టాలని తన సొంత కష్టాలుగా భావించి ముందుకు సాగడంతో పవన్ నిజమైన ప్రజా నాయకుడిగా కోట్ల మంది ప్రజల హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిత్వం కూడా. సమస్యల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, చొరవ ప్రత్యేకమైనవి. సాధారణంగా ప్రతి నాయకుడిలో కనిపించని ఒక ప్రత్యేకత పవన్ గారిలోనే  ఉంది.  సమస్యలని  తన సమస్యలుగా భావించి స్పందించే స్వభావం ఆయన్ని ప్రజలకి  మరింత దగ్గర చేసింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని కొనియాడారు.

Also read: Kajal Aggarwal: హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఉండరు.. నిజం చెప్పేసిన కాజల్

పవన్ కల్యాణ్ లీడర్‌షిప్‌పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ అండ్ జనసేన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అడివి శేష్ గారు మీరు ఫ్యూచర్ లో జనసేనతో కలిసి ప్రయాణం చేయాలనీ కోరుతున్నారు. అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ ఇచ్చిన జోష్ లో ఉన్నాడు. టాక్ కి భిన్నంగా మంచి కలెక్షన్స్ ని రాబట్టడంతో పాటు ఓటిటి వేదికగా పలు సంచలనాలని సృష్టిస్తుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com