Home

»

Latest News

Subhashini: ప్రముఖ సినీ నటి సుభాషిణి ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా! 

Apr 6, 2026 3:57PM

 

-సౌత్ సినీ, టీవీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్ 
-ఎంతో భవిష్యత్తు ఉన్న సుభాషిణి సూసైడ్ 
-నిన్న రాత్రి ఏం జరిగింది
-హస్బెండ్ వేధింపులే సూసైడ్ కి కారణమా  
-పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది 

నటనా రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రముఖ నటి 'సుభాషిణి'(Subhashini)మరణించిన సంఘటన ఇప్పుడు సౌత్ టివి, సినీ సర్కిల్స్ ని షాక్ గురి చేస్తుంది. పైగా అందర్నీ కలిచి వేస్తున్న విషయం ఏంటంటే సుభాషిణిది సూసైడ్. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

సుభాషిణి సుదీర్ఘ కాలం నుంచి యాక్టింగ్ ని తన వృత్తిగా చేసుకొని పలు సీరియల్స్ లో చేస్తూ వస్తుంది. ముఖ్యంగా' కయల్'(Kayal)అనే తమిళ సీరియల్ లోని క్యారక్టర్ అనేక మంది అభిమానులని ఏర్పడేలా చేసింది. అలాంటి సుభాషిణి నిన్న నైట్ చెన్నై నగరంలోని పోరూరులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని బలవన్మరణకి పాల్పడింది. నిన్న నైట్ భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లుగా  తెలుస్తోంది. దాంతో  తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకి సిద్దపడినట్టుగా చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని వెల్లడి చేస్తూ తమ దర్యాప్తుని ప్రారంభించారు.


Also Read: Anil ravipudi: హీరోగా అనిల్ రావిపూడి!.. ఈ హీరోయిన్ ఓకేనా! 

 సుభాషిణి భర్త పేరు పిప్పిన్‌. ఇద్దరు కలిసి  బెంగళూరులో నివసిస్తూ ఉంటారు. షూటింగ్‌ల కారణంగానే చెన్నైలో అపార్ట్ మెంట్ రెంట్ కి తీసుకొని ఒక్కటే ఉంటుంది. కొన్ని సినిమాల్లోను చేసినట్టుగా చెప్తున్నారు. సుభాషిణి శ్రీలంక దేశస్థురాలు కాగా వయసు 36 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లోను యాక్టీవ్ గా ఉండే సుభాషిణికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com