
కోలీవుడ్ యాక్టర్ సూరితో కలిసి టాలీవుడ్ యాక్టర్ సుహాస్ నటించిన తమిళ మూవీ ‘మండాడి’. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మతిమారన్ పుగళేంది చేసిన కామెంట్స్ తెలుగునాట వివాదానికి కారణమయ్యాయి. "తెలుగులో కొందరు సుహాస్ ని రంగు పేరుతో అవమానించారు. కానీ, తమిళ ప్రజలు అలా చేయరు." అన్నట్టుగా మతిమారన్ కామెంట్స్ చేశారు. సుహాస్ సైతం ఆ కామెంట్స్ ను ఖండించలేదు.
సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ వీడియో వైరల్ అవ్వడంతో తెలుగు ఆడియన్స్ అసహనం వ్యక్తం చేశారు. "సుహాస్ ని ఎప్పుడూ అవమానించలేదు. హీరోగా మంచి సినిమాలు చేస్తే ఆదరించాము. అసలు తెలుగు ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే.. హీరోగా సుహాస్ ఇన్ని సినిమాలు చేసేవాడా?" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వివాదం ముదిరేలా ఉండటంతో దీనిపై సుహాస్ స్పందించారు.

తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణను గుర్తుచేసుకుంటూ, సుహాస్ ఒక ఎమోషనల్ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. "నేను మొదట్లో యూట్యూబ్‌లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల నుంచి, క్యారెక్టర్ యాక్టర్‌గా మారే వరకు, ఆపై హీరోగా నిలబడే వరకు ప్రతి అడుగులోనూ మీ ప్రోత్సాహం నాతోనే ఉంది" అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు చూపిస్తున్న నిరంతరమైన ప్రేమేనని చెప్పుకొచ్చారు. ఎలాంటి నేపథ్యం లేకపోయినా, తన నటనను మాత్రమే చూసి గుండెల్లో పెట్టుకున్న తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు. తాను ఎక్కడి నుంచి వచ్చానో ఎప్పటికీ మరచిపోనని, ప్రేక్షకులకు తనపై ఉన్న నమ్మకాన్ని గెలుచుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి నటిస్తానని హామీ ఇచ్చారు.
[Suhas Emotional Letter, Suhas Clarification Note, Actor Suhas, Suhas Mandaadi, Mandaadi Movie, Director Mathimaran, Telugu Film News, Telugu News]






