చిరంజీవికే యాక్టింగ్ చెబుతాడా.. అనిల్ రావిపూడి ఎక్కువ చేస్తున్నాడు అనిపించింది!
on Jan 22, 2026

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తూ రావిపూడి చేసిన మ్యాజిక్ కి అందరూ ఫిదా అయ్యారు.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో చిరంజీవితో అలా కాదు ఇలా చేయండి అంటూ అనిల్ రావిపూడి పదేపదే చెబుతుండటంతో.. ఏంటి ఎక్కువ చేస్తున్నాడని హర్షవర్ధన్ అనుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ షేర్ చేసుకున్నారు.
"అనిల్ రావిపూడి టెర్రిఫిక్ డైరెక్టర్. ఎంతో హోంవర్క్ చేస్తారు. షూట్ లో చిరంజీవి గారు ఒకలా చేస్తే.. అనిల్ వచ్చి అలా కాదు ఇలా చేయండి అని చెప్తుంటే మొదట్లో నేను షాకయ్యాను. ఏంటి ఈయనొచ్చి చిరంజీవి గారికి యాక్టింగ్ చెబుతున్నాడు.. కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించింది. కానీ అసలు మేటర్ నాకు తర్వాత తెలిసింది.
చిరంజీవి గారి పాత సినిమాలలోని వింటేజ్ సీన్స్, బాడీ ల్యాంగ్వేజ్ లను సమీకరించి ఒక కథ తయారు చేసుకున్నాడు. ఇందులో మా హీరోలుగా చేయండి సార్ అని.. చిరంజీవి గారి పాత సినిమా సీన్ ని చిరంజీవి గారికే చూపించేవాడు. చిరంజీవి గారు కూడా సరదాగా.. వేరే ఎవరినో ఇమిటేట్ చేయడం కష్టం, నాకు వచ్చింది చేస్తాను అనేవారు. చిరంజీవి వర్సెస్ చిరంజీవి అన్నమాట." అంటూ 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ విశేషాలను పంచుకున్నారు హర్షవర్ధన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



