ఆటో రాంప్రసాద్‌కి యాక్సిడెంట్.. ఎలా జరిగింది?
on Dec 5, 2024
జబర్దస్త్ షో ద్వారా అందరికీ తెలిసిన ఆటో రాంప్రసాద్‌కి యాక్సిడెంట్ జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతనికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. గురువారం షూటింగ్‌కి వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ కారుకు ముందుగా వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో అతని కారు ముందున్న కారును ఢీ కొట్టింది. అలాగే అతని వెను వస్తున్న ఆటో రాంప్రసాద్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ స్వల్పంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అతని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



