
సౌందర్య... ప్రేక్షకులని థియేటర్స్ వైపు పరుగులు తీయించేలా చేసిన నటి. అభిమానులకి ఆరాధ్య దేవత. థియేటర్ లోకి సినిమా స్టార్ట్ అయ్యాక వచ్చిన వాళ్ళైతే సౌందర్య ఎంట్రీ ఇచ్చిందా అని ఎంతో ఆత్రంగా అడిగి, ఇంకా రాలేదని తెలిసి హమ్మయ్య అనుకున్న వాళ్ళు ఎంతో మంది. హీరోతో పాటు సమాన పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఆమె అభిమానులని, ప్రేక్షకులని శోక సంద్రంలో ముంచుతూ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా సహా నటి ఆమని ఒక ఇంటర్వ్యూ లో సౌందర్య గురించి మాట్లాడుతు భావోద్వేగానికి గురయ్యింది. ఆమని మాట్లాడుతు తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ సౌందర్య ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో జీవించింది. సాధారణంగా చాలామంది నటీమణులు మేకప్ వేస్తేనే అందంగా కనిపిస్తారు. కానీ సౌందర్య మాత్రం ఎలాంటి మేకప్ లేకపోయినా, ఎంతో సింపుల్‌గా ఉన్నా అచ్చం దేవతలా ప్రకాశించేది. ఆమె అంత అందంగా ఉండేది కాబట్టే, ఆ దేవుడు కూడా ఆమెను అంత తొందరగా తన దగ్గరకు తీసుకుపోయాడేమో. తనకు లోకజ్ఞానం గానీ, లౌక్యాలు గానీ అస్సలు తెలియవు. అన్నీ వాళ్ల నాన్నగారే చూసుకునేవారు. నాన్నంటే ఆమెకు ప్రాణం. ఆయన ఏది చెబితే అదే వేదం, ఆ పని వద్దు అంటే ప్రపంచంలో ఎవరు చెప్పినా ఆ పని చేసేది కాదు. అలాంటి తండ్రి హఠాత్తుగా చనిపోయినప్పుడు సౌందర్యకి అన్నీ తానై వాళ్ల అన్నయ్యే చూసుకున్నారు. అంత కష్టపడి కోట్లు సంపాదించింది కానీ, చివరకు జీవితంలో ఏదీ అనుభవించకుండానే అర్థాంతరంగా కన్నుమూసింది. తనకంటూ ఎన్నో కలలు ఉండేవి.. సినిమా వేరు, ఫ్యామిలీ వేరు అంటూ భర్త, పిల్లలతో కలసి ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ చివరకు ఆ అన్నయ్యతో పాటే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో 'రామాయణ' డిస్టిబ్యూట్ చేస్తున్న టాప్ హీరో: మరి తెలుగులో ఎందుకని!
.webp)
ఇటీవల బెంగళూరులోని సౌందర్య వాళ్ళ ఇంటి వైపు వెళ్లి చూశాను. ఎంతో కళకళలాడిన ఆ ఇల్లు, ఇప్పుడు ఎవరూ లేక ఓ పాడుపడిన భవనంలా మారిపోవడం చూసి మనసు బరువెక్కింది' అంటూ ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.
[Aamani About Soundarya, aamani emotional comments on soundarya, Soundarya actress, Aamani emotional comments, Soundarya death, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]




.webp)

