Home

»

Latest News

Aadarsha Kutumbam Movie Review Telugu: ఆదర్శ కుటుంబం  మూవీ రివ్యూ 

Oct 30, 2026 1:04PM


-సినిమా పేరు: ఆదర్శ కుటుంబం
-న‌టీన‌టులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేత ఫేతురాజ్ , డింపుల్ హయతి ఉదయ్ బీర్ సందు, రావు రమేష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సచిన్ ఖేల్ కర్ ,సత్య,   తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: రవి కె చంద్రన్ 
-ఎడిటింగ్: నవీన్ నూలి
-మ్యూజిక్: థమన్ 
-నిర్మాత‌: సూర్య దేవర రాధాకృష్ణ 
-బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్,
-రచన,దర్శకత్వం: త్రివిక్రమ్ 
-రిలీజ్ డేట్ :అక్టోబర్ 30 ,2026


విక్టరీ వెంకటేష్,శ్రీనాధ్ శెట్టి, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం' ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. దీంతో అభిమానులు, సినీ ప్రియులు, ప్రేక్షకులలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.


కథ
 
బీహార్ కి చెందిన చందన్ బాదూర్( ఉదయ్ బీర్ సందు) ముఠా. మనిషి రక్తం మరిగిన పరమ కిరాతకులు. డబ్బు కోసం మనుషులని అత్యంత దారుణంగా చంపేస్తుంటారు. 
పోలీసులకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. చిట్టిబాబు తొట్టి (వెంకటేష్) ,మాలతి(శ్రీనిధి శెట్టి) సంపూర్ణ( యువినా పార్థవి) శర్వా(రాజా ప్రజ్వల్) ఒక ఫ్యామిలీ. అన్యోన్య కుటుంబం అనుకుంటే పొరపాటే అవుతుంది. మాలతి అప్పులు చేస్తుంటుంటే చిట్టిబాబు ఏమో కూతురితో డబ్బు ఉన్నోడిని ప్రేమించు అనే రకం. కూతురేమో తనకంటే తక్కువైన మెకానిక్ షాప్ లో పని చేసే ముస్లిమ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. శర్వా ఏమో ఎదుటి వ్యక్తులకి తెలియకుండా పర్సులు కాజేసే రకం. మరి ముఖ్యంగా వీళ్ల అన్యోన్యత ఎలా ఉంటుందో చెప్పాలంటే  శర్వాకి హార్ట్ లో హోల్ పడుతుంది. ఆ విషయాన్నీ కూడా చిట్టిబాబుతో సహా  అందరూ లైట్ గా తీసుకుంటారు. అసలు ఆ నలుగురి పేర్లు కూడా అబద్దం. ఒరిజినల్ పేర్లు అర్జున్ ప్రసాద్, భవాని, కమిలిని, ప్రభాస్. మరి చిట్టిబాబు, మాలతి, సంపూర్ణ,శర్వా గా ఎందుకు ఉన్నారు. చందన్ ముఠా కోసం పోలీసులు ఏం చేసారు?  కథలోని అన్ని క్యారక్టర్ లకి సమాజాన్ని నడిపించే ప్రకృతికి, డెస్టినీ కి, ఫేమస్ జడ్జి  ప్రదీప్ సర్కార్( నాజర్)  జడ్జ్ మెంట్ ఇచ్చిన  తీర్పుకి ఉన్న సంబంధం, సంగమమే ఆదర్శ కుటుంబం.


ఎనాలసిస్ 
 మూవీ మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. మరో సారి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ అయ్యింది. కుటుంబం, విలువ, ప్రేమ, ఆప్యాయతలకి  ఒక కొత్త అర్దాన్ని ఇవ్వడంతో పాటు మంచి మెసేజ్ ఇచ్చింది. కాకపోతే గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో వచ్చే సన్నివేశాల ద్వారా ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించవచ్చు. కానీ ఆ దిశగా చేయలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభం సన్నివేశమే ఒళ్ళు జలదరిస్తుంది. ఆ తర్వాత వచ్చిన చిట్టిబాబు(వెంకటేష్) మాలతి(శ్రీనిధి శెట్టి) అండ్ ఫ్యామిలీ సీన్స్ కొత్తగా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ డైలాగ్ సూపర్.  

వంద కోట్ల లాటరీ విషయంలో ఇంకొంచం క్యూరియాసిటీ సృష్టించాల్సిందేమో. గేటెడ్ కమ్యూనిటీ లో వచ్చిన సీన్స్ పర్లేదు. చిట్టిబాబు, నివేత ఫేతురాజ్  మధ్య వచ్చిన సీన్స్ పర్లేదు. ఇంటర్వెల్ కి ఇంకో ఇరవై నిముషాలు టైం ఉందనగా కథనంలో వేగం పెరగడంతో పాటు ప్రతి సీన్ అంచనా వేయని విధంగా సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ పీక్. సెకండ్ హాఫ్ లో వచ్చిన ప్రతి సీన్ బాగుంది, ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ. పోలీసులు, చిట్టిబాబు ఫ్యామిలీ, విలన్స్ మధ్య జరిగే  టోటల్ ఎపిసోడ్ ఎక్స్ లెంట్. టోటల్ గా సెకండ్ హాఫ్ లో    యాక్షన్ కి యాక్షన్, కామెడీకి కామెడీ, క్యూరియాసిటీకి క్యూరియాసిటీ అన్ని కూడా పోటాపోటీగా కుదిరాయి.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్. 


నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు 

చిట్టిబాబుతో పాటు అర్జున్ ప్రసాద్ గా వెంకటేష్ నటన మరో సారి విక్టరీ హోదాలో  ఎక్కడా ఓవర్ డోస్ లేకుండా సాగింది. ముఖ్యంగా ఒక కొత్త రకం వెంకటేష్ కనిపించాడు. శ్రీనిధి శెట్టి కూడా అంతే నేనేం తక్కువ తిన్నానా అంటూ మాలతి గా చించి పడేసింది. తను తప్ప మాలతి క్యారక్టర్ లో మరొకర్ని ఊహించుకోలేము. చిట్టిబాబు కూతురు, కొడుకు గా చేసిన వాళ్ళు కూడా మూవీకి ప్లస్ అయ్యే పెర్ఫార్మ్ లో మెప్పించారు. నారారోహిత్ పోలీస్ ఆఫీసర్ గా సెటిల్డ్ పెర్ఫార్మ్ చేసిన ఆదర్శ కుటుంబానికి మరో అందంగా నిలిచాడు. మేకర్స్ ఇచ్చిన క్యారక్టర్ కి నివేత పేతురేజ్ న్యాయం చేసింది. సత్య మరో సారి నవ్వులు పూయించాడు. రావు రమేష్,సచిన్ ఖేల్ కర్,బ్రహ్మాజీ తో పాటు మిగతా అందరూ కూడా తమ నటనతో మెప్పించారు. ఇక  చందన్ బాదూర్ రోల్ లో విలన్ గా చేసిన ఉదయ్ బీర్ సందు అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. ఎంతలా అంటే బయట ఎక్కడైనా కనపడితే భయపడేంతలా.. చందన్ టీం కూడా సేమ్ యాక్సెస్ ని కలిగిస్తుంది. దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ మరో సారి భారీగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చిన టేకింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే లో తన జైత్రయాత్ర కొనసాగింది. థమన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్, ఫొటోగ్రఫీ ఒక రేంజ్ లో కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్.

బలాలు

1 . కథ
2 . కథనం
3 . వెంకటేష్, శ్రీనిధి శెట్టి తో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్
4 . డైలాగ్స్ 
5 . డైరెక్షన్ 


 చివరిగా చెప్పాలంటే ఎక్స్ పెక్టేషన్ లేకుండా లోపలకి వెళ్తే ఎంటర్ టైన్  అయ్యి బయటకి వస్తారు.

రేటింగ్ 2 .75 /5 

                                                                                                   అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com