
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. దీంతో అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చేందుకు మరో కీలక అడుగు పడినట్లయింది.
‘ఆదర్శ కుటుంబం’కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైం 155 నిమిషాలని తెలుస్తోంది. క్రైమ్, కామెడీ, యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను కలగలిపి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ ఉండగా.. ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం.
వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచీ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా థామస్, డింపుల్ హయాతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ మారిన ఈ సినిమా.. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున విశ్వక్ సేన్ ‘కల్ట్’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఆసక్తికరంగా మారింది.
మరి వెంకటేష్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుంది? సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అన్నది చూడాలి.
ఇది కూడా చదవండి: ఘట్టమనేని జయకృష్ణ రెండో సినిమా.. ‘బేబీ’ కాంబోతో హిట్ కొట్టేనా.?
[Aadarsha Kutumbam Censor Report, Aadarsha Kutumbam First Review, Aadarsha Kutumbam Movie, AK47 Movie, Victory Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Telugu Film News]






