
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌పై చర్చ మొదలైంది.
ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం.. ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.63 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నైజాం రూ.17 కోట్లు, సీడెడ్ రూ.7 కోట్లు, ఆంధ్రా రూ.20 కోట్లతో కలిపి తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.44 కోట్లుగా చెబుతున్నారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సుమారు రూ.6 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.13 కోట్లుగా పేర్కొంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.65 కోట్ల షేర్‌గా ఉండొచ్చని సమాచారం.
‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్ రెస్పాన్స్ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబో క్రేజ్ స్థాయిలో లేనప్పటికీ.. ఇప్పుడు బుకింగ్స్ పుంజుకుంటున్నాయి. పబ్లిక్ పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ లో జోరు చూపే అవకాశముంది. లాంగ్ రన్ కొనసాగితే.. రూ.65 కోట్ల షేర్ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు.
ఇది కూడా చదవండి: కమల్ హాసన్‌తో సినిమా.. ‘మెగావర్స్’లో చిరంజీవి క్రేజీ ప్రామిస్.!
.webp)
[Aadarsha Kutumbam Break Even Target, Aadarsha Kutumbam business, Aadarsha Kutumbam box office, Aadarsha Kutumbam, Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]




