ఎన్టీఆర్ తన ఆఖరిపోరాటానికి సిద్ధం
on Nov 30, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)రీసెంట్ గా 'దేవర'(devara)పార్ట్ 1 తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అప్ కమింగ్ మూవీ వార్ 2 మీద ఉంది.బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్(hrithik roshan)తో కలిసి ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.దీంతో ఎన్టీఆర్ (ntr)అభిమానులతో పాటు ఇండియన్ మూవీ లవర్స్ అందరిలో వార్ 2(war 2)పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ దశకు చేరుకుంది. అందులో భాగంగా డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్టీఆర్, హృతిక్ పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నారు.ఇందు కోసం ముంబై శివారు లలో అత్యంత భారీ వ్యయంతో ఒక భారీ సెట్ ని వెయ్యబోతున్నారు.ఈ యాక్షన్ ఎపిసోడ్ కి 'స్పిరో రజా టోస్,సే యోంగ్ ఓహ్ అనే ఇద్దరు హాలీవుడ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లు నేతృత్వం వహిస్తునట్టుగా తెలుస్తుంది.
దాదాపుగా పదిహేను రోజులు పాటు జరిగే ఆ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే.ఇక మిగతా అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న క్యారక్టర్ ని పోషిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఈ విషయం మీద అధికార ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు.హిట్ చిత్రాల నిర్మాణ సంష్త యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న వార్ 2 కి ఆయాబ్ ముఖర్జీ దర్శకుడు కాగా కియారా అద్వానీ(kiara adwani)కథానాయిక.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
