Home

»

Latest News

ఆ టైటిల్‌నే ఫిక్స్ చేసుకున్న క్రిష్

Dec 02, 2020

స‌న్న‌పురెడ్డి వెంక‌టరామిరెడ్డి ప్ర‌సిద్ధ‌ న‌వ‌ల కొండ‌పొలం కి.. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర రూప‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ ఎంట‌ర్ టైన‌ర్ లో సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తుండ‌గా.. అత‌నికి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొత్తం వికారాబాద్ అడ‌వుల్లో, ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేశారు.

కాగా, ఈ చిత్రానికి కొండ‌పొలం అనే టైటిల్ నే ఫిక్స్ చేసే దిశ‌గా క్రిష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఇప్ప‌టికే టైటిల్ రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌హారం కూడా పూర్త‌యింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల్లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని.. ప‌రిస్థితులను బ‌ట్టి థియేట‌ర్స్ లో లేదంటే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.

క్రిష్ హోమ్ బేన‌ర్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ కొండ‌పొలంని నిర్మిస్తోంది. మ‌రి.. వైష్ణ‌వ్, ర‌కుల్ తో క్రిష్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com