Home

»

Latest News

Ustaad Bhagat Singh: వివాదంలో ఉస్తాద్ భగత్ సింగ్.. వాళ్ళ పనేనా?

Mar 09, 2026

  • 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్ పై కాంట్రవర్సీ 
  • తెరవెనుక రాజకీయం జరుగుతుందా?

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుందని తెలుపుతూ ఇటీవల ట్రైలర్ టీజ్ ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. 

వివాదానికి కారణమైన సన్నివేశం
టీజర్ చివరలో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని కాలుతో తన్నే యాక్షన్ సీన్ ఉంది. ఆ వ్యక్తి ఆహార్యం (టోపీ మరియు కట్టు) చూస్తుంటే అతను ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్న తరుణంలో, ఇలాంటి దృశ్యాన్ని టీజర్‌లో చూపించడం ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాజకీయం
పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయంగా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డూ వివాదం వంటి అంశాల నేపథ్యంలో ఆయన ఇమేజ్ మారిపోయింది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. టీజర్ లో ఒక ముస్లిం వ్యక్తిని కాలుతో తన్నడం అనేది ఇష్యూ చేయడానికి ఒక పునాదిలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

సినిమాను సినిమాగా చూడలేమా?
మరోవైపు, ఇది కేవలం సినిమా మాత్రమేనని, అందులో పాత్రలను మతంతో ముడిపెట్టకూడదనే వాదన కూడా బలంగా ఉంది.

సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా సరే శిక్షించడం ఆ పాత్ర స్వభావం. అక్కడ ఉన్నది ఒక పాత్ర మాత్రమే తప్ప, ఒక మతాన్ని ఉద్దేశించినది కాదని గుర్తించాలి.

అదే టీజర్ లో పవన్ కొట్టిన మిగతా ఇద్దరు వ్యక్తులు హిందువులో లేక క్రిస్టియన్లో అయి ఉండవచ్చు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు

సినిమాలో పాత్రలకు కులం, మతం ఉండటం సహజం. కానీ అది ఒక కమ్యూనిటీని తక్కువ చేయడానికే అని ముందే నిర్ణయానికి రావడం సరికాదు.

సినిమా విడుదలైన తర్వాత అందులో ఏదైనా అభ్యంతరకర అంశాలు ఉంటే చర్చించడం సమంజసం కానీ, ఒక చిన్న సీన్ చూసి విమర్శించడం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశ్లేషణలు, సినిమా అప్డేట్స్ కోడం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com