రాజాసాబ్ జోలికి వస్తే కఠిన చర్యలు..అభిమానుల పరిస్థితి ఏంటో!
on Jun 13, 2025

ఎంటైర్ తన కెరీర్ లోనే రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas)ఫస్ట్ టైం 'ది రాజాసాబ్'(The Raja saab)అనే హర్రర్ కామెడీ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు 'రాజాసాబ్' కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన యంగ్ అండ్ ఓల్డ్ ప్రభాస్ లుక్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు కూడా పీక్ లో ఉన్నాయి. నిధి అగర్వాల్(Nidhhi agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan)హీరోయిన్లుగా చేస్తుండగా 'ప్రతిరోజు పండగే' మూవీ ఫేమ్ మారుతీ(Maruthi)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక 'రాజాసాబ్' టీజర్ ఈ నెల 16 న విడుదల కాబోతుంది. కానీ సోషల్ మీడియాలో టీజర్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు వీటిపై రాజాసాబ్ టీమ్ స్పందిస్తు ఎవరైనా లీక్ వీడియోస్ తో పాటు రాజా సాబ్ కంటెంట్ కి సంబంధించిన అనధికార వీడియోల్ని, ఫోటోలని షేర్ చేస్తే, వారి సోషల్ మీడియా అకౌంట్ ని తక్షణమే నిలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రేక్షకులకి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం ఎంతగానో కష్టపడుతుందని అందరు సహకరించాలని కోరింది.
మేకర్స్ టీజర్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియాకి ఆహ్వానాలు వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ లో 'రాజాసాబ్' కోసం వేసిన భారీ సెట్ ని కూడా పరిచయం చేయబోతున్నారనే సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వస్తుండటంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజె విశ్వప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు. సంజయ్ దత్, రిద్ది కుమార్ కీలక పాత్రలు పోషిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. డిసెంబర్ 5 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



