Home

»

Latest News

అల్లువారబ్బాయికి ఆడపిల్ల

Nov 22, 2016 10:38AM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌‌ ఇంట శ్రీమహాలక్ష్మీ అడుగుపెట్టింది. ఆయన భార్య స్నేహారెడ్డి నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బన్నీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ పెద్దల అంగీకారంతో స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. బన్నీ దంపతులకు తొలి సంతానంగా మగబిడ్డ అయాన్ జన్మించాడు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ అభిమానులు లిటిల్ బేబికి సోషల్ మీడియాలో బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com