Home

»

Latest News

టీజ‌ర్ రివ్యూ:  ఒక్క‌డొచ్చాడు

Oct 22, 2016 11:22AM

పందెం కోడి త‌ర‌వాత ఆ స్థాయిలో విజ‌యం అందుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు విశాల్‌. యేడాదికి క‌నీసం రెండు సినిమాలైనా విడుద‌ల చేస్తున్నాడు. కానీ... స‌రైన విజ‌య‌మే ద‌క్క‌డం లేదు. ఈసారి.. ఒక్క‌డొచ్చాడు అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి సూర‌జ్ ద‌ర్శ‌కుడు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఒక్క‌డొచ్చాడు టీజ‌ర్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా అంతా యాజ్ ఇట్ ఈజ్ త‌మిళ ఫ్లేవ‌ర్‌లో సాగ‌బోతోంద‌ని చెప్ప‌డానికి ఈ టీజ‌రే సాక్ష్యం.   'తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను.. కానీ చేసిన తప్పును సమర్ధించే వాడిని.. ఎప్పటికీ క్షమించను' అంటూ ఓ డైలాగ్ వినిపించింది ఈ టీజ‌ర్‌లో. దాన్ని బ‌ట్టి.. క‌థ‌, క‌థ‌నాలు, విశాల్ పాత్ర ఏ ర‌కంగా సాగుతాయో అర్థం అవుతోంది. ఐ యామ్ బ్యాక్ అంటూ ఒక‌ప్ప‌టి స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు... లాస్ట్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఆక‌ట్టుకొంది. త‌మ‌న్నా గ్లామ‌ర్‌, ఆమె వేసిన స్టెప్పులు.. యాక్ష‌న్ దృశ్యాలు  ఇవ‌న్నీ కంటికి ఇంపుగా ఉన్నాయి. బ‌హుశా ఈ సినిమాని గ‌ట్టెక్కించాల్సిన‌వి అవేనేమో?  యాక్ష‌న్ ప్రియులు, మాస్ ఆడియ‌న్స్‌ మాత్రం ఈ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. విశాల్ టార్గెట్ కూడా అదేనేమో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com