Home

»

Latest News

ఎన్టీఆర్‌ని భ‌య‌పెట్టిన ఇజం!

Oct 22, 2016 10:40AM

 

ఇజం ఏమీ హార‌ర్ సినిమా కాదు... భ‌య‌ప‌డిపోవ‌డానికి.  కానీ ఈ సినిమా చూసి ఎన్టీఆర్ క‌చ్చితంగా ఝ‌డుసుకొని ఉంటాడు. ఎందుకంటే.. సినిమా రిపోర్ట్‌, రిజ‌ల్ట్ అలా ఉంది మ‌రి. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా క‌చ్చితంగా పూరి జ‌గ‌న్నాథ్ తోనే అనుకొన్నారంతా. కానీ ఇజం రిజ‌ల్ట్‌తో ఇదంతా తారు మారు అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇజం ఫ‌లితం సంగ‌తి అటుంచితే... పూరి ఈ సినిమాతో ఏమాత్రం మార‌లేదు. అదే పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి త‌ర‌హా టేకింగు... అవే రొటీన్ సీన్లు. డైలాగ్ రైట‌ర్‌గానూ పూరి మెరిసింది లేదు. వ‌రుస‌గా హిట్ల మీద హిట్లు కొట్టి ఒక‌ప్ప‌టి విధ్వంస‌క‌ర ఫామ్ ని అందుకొన్న ఎన్టీఆర్‌.. ఇప్పుడు అదే ఫ్లోని కొన‌సాగించాల‌నుకొంటున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో పూరికి ఎన్టీఆర్ అవ‌కాశం ఇవ్వ‌డం... ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మే అవుతుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌.  అందుకే పూరి ఎన్ని క‌థ‌లు వినిపిస్తున్నా.. ఎన్టీఆర్ ఇంత కాలం సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఇజం రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. ఈ సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అనేది తేలిపోయింది. సో.. ఎన్టీఆర్ పూరి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం దొరికింది. పూరి కూడా ఎన్టీఆర్ త‌న‌కు అవ‌కాశాన్ని ఇస్తాడ‌ని అనుకోవ‌డం లేదు కూడా. అందుకే.. త‌న ప్ర‌య‌త్నాలు తాను మొద‌లెట్టేశాడ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇజం ఏమాత్రం ఆడినా.. పూరికి ఎన్టీఆర్ తో మ‌రో సినిమా చేయ‌డానికి అవ‌కాశం ద‌క్కేది. ఇప్పుడు అన్ని మార్గాలూ క్లోజ్ అయిపోయిన‌ట్టే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com