Home

»

Latest News

యంగ్‌టైగర్‌పై స్టైలిష్ స్టార్‌దే పైచేయి..?

Oct 21, 2016 2:46PM

ఈ ఏడాది తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రిలీజైనా వాటిలో హిట్‌ మెట్లెక్కింది యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఈ రెండు సినిమాల్లో అర్జున్ నటించిన సరైనోడు 70 కోట్లు వరకు కలెక్ట్ చేయగా..ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ 80 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్‌లో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కలెక్షన్న పరంగా జూనియర్ ఎన్టీఆర్ పైచేయి సాధించినా..సెంటర్ల విషయానికి వచ్చే సరికి సరైనోడు దుమ్ములేపాడు. "సరైనోడు" 115 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవాలను జరుపుకోగా.."జనతా గ్యారేజ్" 39 కేంద్రాల్లో మాత్రమే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది. ఆ రకంగా చూస్తే జూనియర్‌పై..అల్లువారబ్బయిదే అప్పర్ హ్యాండ్ అని అర్థమవుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com