
బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్, అందాల తార ఐశ్వర్యరాయ్ లు ఈ మధ్య 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందం వయసు పెరిగినా ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. అంతకు మించి అన్నట్టు ఉంది. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇటీవలే విడుదల చేయగా.. రణబీర్, ఐష్ ల మధ్య ఉన్న సన్నివేశాలు మంచి వేడిని పుట్టిస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈసినిమాలో రణబీర్, ఐష్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 'బులెయా' పాటలో రణబీర్, ఐష్ లను చూస్తే మాత్రం ఎవరైనా ఈ హాట్ జోడికి ఫిదా అయిపోవాల్సిందే. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు సెన్సార్ బోర్డు రూపంలో ఈసినిమాకి ఎదురుదెబ్బ తగిలింది. ఐశ్వర్య, రణ్ బీర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లు శృతి మించాయని.. సినిమాలో అసభ్యంగా అనిపించిన మూడు సన్నివేశాలను తొలగించి, యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. మరి ముందు ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం..






