.jpg)
పవన్ కల్యాణ్ ఒట్టి మూడిస్ట్ అన్న సంగతి ఆయన వీరాభిమానులకు కూడా తెలుసు. ఎప్పుడేం చేయాలో.. అది తప్ప అన్నీ చేసేస్తుంటాడు. తన మూడ్‌ని బట్టి నడుచుకొంటాడు. పవన్‌తో సినిమా అనగానే దర్శకులు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆయనమూడ్ బాగుంటేనే షూటింగ్.. లేదంటే లేదు. ఎప్పుడు ఏ తిక్క ఎలా రేగుతుందో తెలీదు. ఇప్పుడు ఆ తిక్క స్వయంగా అనుభవిస్తున్నాడు డాలీ. పవన్ సినిమా గోపాల గోపాలకి ఆయనే దర్శకుడు. ఇప్పుడు సూర్య గైర్హజరుతో కాటమరాయుడు సినిమా డైరెక్షన్ ఛాన్స్ అందుకొన్నాడు. ఈసినిమా మొదలై 3 నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకూ ప్రోగ్రెస్ కనిపించడం లేదు. తాజాగా నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించాడు పవన్. ఆ సినిమాకి డిసెంబరు నుంచి కాల్షీట్లు ఇచ్చాడట. కాటమరాయుడు, నేసన్ సినిమా ఒకేసారి పట్టాలెక్కించాలన్నది పవన్ ఆలోచన. అయితే ఒక సినిమాకే ఇక్కడ దిక్కూ దివాణం లేదు.. రెండు సినిమాలూ ఎలా హ్యాండిల్ చేస్తాడబ్బా?? అనుకొంటున్నారు సినీ జనాలు. మరోవైపు త్రివిక్రమ్ సినిమా కూడా డిసెంబరు నుంచే మొదలవుతుంది. ఆలోగా కాటమరాయుడు పనులు ఫినిష్ అవ్వాలి. తీరా చూస్తే.. ఇప్పటికి 10 శాతం కూడా షూటింగ్ పూర్తవ్వలేదు. కాటమరాయుడు ని వర్కవుట్ చేయడం పవన్‌కి ఇష్టం లేదని, అందుకే నేసన్ సినిమాకి కొబ్బరికాయ్ కొట్టేశారని చెబుతున్నారు. ఒకవేళ ఈసినిమా పక్కన పెడితే డాలీ అడ్డంగా బుక్కయిపోయినట్టే. పవన్ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీక కన్ ఫ్యూజ్ అయి.. పిచ్చెక్కిపోతున్నాడు డాలీ. పాపం... పవన్‌తో పెట్టుకొంటే అంతే మరి.






