Home

»

Latest News

లవర్ గురించి నోరు మెదిపిన ప్రణీత..

Sep 30, 2016 11:14AM

సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లికి రెడీ అవుతుండటంతో ఇండస్ట్రీలోని మిగిలిన హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలపై ఒక కన్నేసి ఉంచింది మీడియా. ఏ హీరోయిన్ కెమెరా కంటికి చిక్కినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ మేడమ్ మీ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు పొందిన ప్రణీతను ఇలాగే కదిపింది మీడియా. దానికి సమాధానంగా అవును నేను ప్రేమలో ఉన్నాను..ఎవరితోనో తెలుసా సినిమాతో అని తెలివిగా బదులిచ్చింది ఈ బెంగుళూరు బ్యూటీ. ప్రస్తుతానికి తాను సినిమాను తప్ప వేరెవరినీ ప్రేమించడం లేదని సినిమాలతోనే బిజీగా ఉన్నానని చెప్పారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com