Home

»

Latest News

హమ్మయ్య పవన్ వచ్చేశాడు..!

Sep 26, 2016 5:08PM

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాటమరాయుడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే వన్ బై వన్ టెక్నీషియన్స్, నటులు జాయిన్ అవుతూ వచ్చారు కానీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం పత్తా లేరు. అందుకు కారణం లేకపోలేదు. ఏపీ ప్రత్యక హోదా విషయంలో పవన్ రాజకీయంగా బిజీగా ఉండటంతో షూటింగ్‌కు హాజరుకాలేకపోయాడు. ఈ పరిణామం మిగిలిన ఆర్టిస్టులకు ఇబ్బంది కలిగించింది. షూటింగ్ ఆలస్యం కావడంతో తమ డేట్స్ వేస్ట్ అవుతున్నాయంటూ నిర్మాత శరత్ మరార్ వద్ద పలువురు గోడు వెల్లబోసుకున్నారట. ఇలాంటి టైంలో ఈరోజు ఉదయం వైట్ లుంగీ, వైట్ షర్టులో..కొత్త లుక్కులో షూటింగ్ స్పాట్‌కొచ్చాడు పవర్‌స్టార్. ఆయన్ను రావడంతో ఆ లోకేషన్‌కే కొత్త కళ వచ్చింది. ఈ విషయాన్ని పవన్ స్నేహితుడు, చిత్ర నిర్మాత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాటమరాయుడు వచ్చాడు..అని ట్వీట్ చేస్తూ ఆయన ఫోటోను పోస్ట్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com