Home

»

Latest News

చిరు, బాల‌య్య పోటీ - రిస్క్ ఎవ‌రికి?

Sep 21, 2016 5:09PM

ఒక‌రికి నేను ఎదురెళ్లినా వాళ్ల‌కే రిస్కు.. ఒక‌రునాకెదురొచ్చినా వాళ్ల‌కే రిస్కు - లెజెండ్‌లో బాల‌య్య ప‌లికిన భారీ డైలాగ్ ఇది. దానికి అభిమానులు విజిల్సే విజిల్స్‌.  అలాంటి బాల‌య్య ఇప్పుడు రిస్కులో ప‌డ‌బోతున్నాడా, రిస్కులో ప‌డేస్తున్నాడా?  అనే చ‌ర్చ టాలీవుడ్ లో జ‌రుగుతోంది?  బాల‌య్యేంటి?  రిస్కేంటి అనుకొంటున్నారా... అయితే మీకీ క‌థ తెలియాల్సిందే.

నంద‌మూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. బాల‌య్య నుంచి వ‌స్తోన్న వందో సినిమా ఇది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అంచ‌నాలు ఇప్ప‌టికే తారా స్థాయికి చేరుకొన్న ఈ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సంక్రాంతి బాల‌య్య కెరీర్‌లో అద్భుత‌మైన సీజ‌న్‌. ఎందుకంటే సంక్రాంతికి విడుద‌లైన బాల‌య్య ప్ర‌తీ సినిమా హిట్టు కొట్టింది. తాజాగా... డి్క్టేట‌ర్‌తో స‌హా. అదే సెంటిమెంట్‌తో 2017 సంక్రాంతికి త‌న గౌత‌మి పుత్ర శాత‌కర్ణి విడుద‌ల చేయాలని ఫిక్స్ అయ్యాడు. జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని విడుద‌ల చేస్తామ‌ని ఎనౌన్స్ చేశారు కూడా.

అందుకు త‌గ్గ‌ట్టుగానే చిత్రీక‌ర‌ణ వేగ‌వంతంగా పూర్తి చేస్తున్నారు. మ‌రోవైపు అదే సంక్రాంతికి చిరు త‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150ని విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయిపోయాడు. జ‌న‌వ‌రి 13న ఈ సినిమా వ‌స్తోందని టాక్‌. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమాని త‌ప్ప‌కుండా దించుతామ‌ని చ‌ర‌ణ్ కూడా చెప్పేశాడు. సో ఈ సంక్రాంతికి చిరు - బాల‌య్య‌ల మ‌ద్య భీక‌ర‌మైన పోటీ చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. నాగార్జున కూడా 'న‌మో వేంక‌టేశాయ‌' చిత్రాన్ని సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. అయితే విడుద‌ల తేదీ విష‌యంలో ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేదు. 

నాగార్జున కాస్త డౌటే గానీ.. చిరు మాత్రం సంక్రాంతికి రావ‌డం ఖాయం. బాల‌య్య‌తో పోలిస్తే చిరంజీవికే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దానికి తోడు 150వ సినిమాపై అంచ‌నాలెక్కువ‌. వినాయ‌క్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. క‌మ‌ర్షియ‌ల్‌గా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి కంటే ఖైదీ నెం.150కే ఎడ్జ్ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ బాల‌య్య సంక్రాంతి హీరో. సంక్రాంతికి వ‌చ్చి అభిమానుల్ని నిరాశ ప‌ర‌చ‌డం బాల‌య్య చ‌రిత్ర‌లోనే లేదు. సో... ఈ సంక్రాంతికి బాల‌య్య రిస్క్ తీసుకోవ‌డం కాదు, రిస్క్‌లో ప‌డేస్తాడ‌ని అభిమానులు అప్పుడే ప్ర‌చారం మొద‌లెట్టేశారు. మ‌రి వీరిద్ద‌రిలో ఈ సంక్రాంతి విజేత ఎవ‌రన్న‌ది కాల‌మే చెప్పాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com