
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దర్శక నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిరు పక్కన హీరోయిన్ను వెతకడానికి వాళ్లకు తల ప్రాణం తోకకు వచ్చింది. అనుష్క, నయనతార, శ్రేయ ఇలా చాలామందిని అనుకుంటే చివరికి కాజల్ ఫైనల్ అయ్యింది. హీరోయిన్ సెట్ అయ్యింది అనుకుంటే విలన్ దొరకలేదు. టాలీవుడ్లో టాప్ విలన్లంతా బిజీగా ఉండటంతో తమిళ ఇండస్ట్రీపైపు చూడగా అక్కడా నో వెకెన్సీ బోర్డు కనిపించడంతో బాలీవుడ్‌కు పరిగెత్తారు దర్శకనిర్మాతలు. చివరకు ఒకప్పుడు చిరుతో హీరోయిన్గా చేసిన అంజులా ఝవేరీ భర్త తరుణ్ అరోరా ఓకే అయ్యాడు. అయితే చిరు చాలా గ్యాప్ తర్వాత వస్తుండటంతో ఎక్కడా తగ్గకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వివి వినాయక్.

ఆ ప్రయత్నంలో నిర్మాత రాంచరణ్‌కి మళ్లీ కష్టాలు తెచ్చిపెట్టాడు. అదేంటంటే ఖైదీ నెం.150లో ఐటెంసాంగ్ పెట్టాలని వినాయక్ ఫిక్సవ్వడమే. సరే ఏం చేస్తాం అని చెర్రి మళ్లీ వెతుకులాట స్టార్ట్ చేశాడు. డ్యాన్సుల్లో చిరు స్పీడుని అందుకునే హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తే తమన్నా వాళ్ల దృష్టిలో పడింది. అంతకు ముందు కూడా తమన్నాతో డ్యాన్స్ చేయాలని ఉందంటూ స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో మిల్కీబ్యూటీని ఐటెంసాంగ్‌కి ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చక్కర్లు కొడుతుండగానే తమన్నాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి కేథరిన్‌ను ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.







