Home

»

Latest News

చంపుకునేటంత అభిమానం వద్దంటోన్న పవర్ స్టార్...

Aug 25, 2016 4:08PM

అభిమానం హద్దులు దాటిపోతోంది. హీరోలపై అభిమానం ప్రాణాలకే ముప్పు తెస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ హత్య అందర్నీ షాక్ కి గురి చేసింది.... చనిపోయిన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని తిరుపతిలో పరామర్శించిన పవన్ కళ్యాణ్ '' చంపుకునేటంత అబిమానం'' వద్దన్నారు. తాను వినోద్ కుటుంబానికి అన్ని విధాల అండగా వుంటానన్న ఆయన హీరోల పేర్లు చెప్పుకుని గొడవలు పడొద్దన్నారు. హీరోల మధ్య పోటీ వుంటుందని, కాని, అది ఇలా ఫ్యాన్స్ ఒకర్నొకరు చంపుకునే స్థాయిలోకి రాకూడదన్నారు. నిజానికి హీరోల మధ్య ఎలాంటి విభేదాలు వుండవనీ. కాని, అభిమానులు మాత్రమే ఇలా కొట్టుకుంటూ వుంటారని పవన్ అన్నారు. వినోద్ హత్యకి కారణమైన వార్ని కఠినంగా శిక్షించాలని కూడా పవర్ స్టార్ అన్నారు. కొన్నాళ్ల క్రితం కర్ణాటకలో మరో హీరో అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వినోద్ కత్తిగాట్లకు గురయ్యాడు. తరవాత హాస్పిటల్ లో చికిత్సపొందుతూ వినోద్ మరణించాడు. అతడి కుటుంబాన్ని పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ తిరపతి వచ్చారు...

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com