Home

»

Latest News

మైక్ పట్టిన దుల్కర్ సల్మాన్.. ఐదు భాషల్లో 'ఐ యామ్ గేమ్' స్పెషల్ ట్రాక్!

Aug 28, 2026 2:04PM

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విశేష ప్రజాదరణ పొందిన కథానాయకుడు దుల్కర్ సల్మాన్. తన వైవిధ్యమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మల్టీటాలెంటెడ్ నటుడు, ఇప్పుడు గాయకుడిగా అవతారమెత్తారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ స్పోర్ట్స్ ఫాంటసీ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్' (I Am Game) సినిమా కోసం దుల్కర్ స్వయంగా ఒక ఎనర్జిటిక్ పాటను ఆలపించారు.

చిత్ర బృందం ఈ సినిమా నుంచి 'లూజర్' (Loser) అనే ప్రత్యేకమైన ట్రాక్‌ను విడుదల చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో ఒకేసారి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జీవితంలో ఓటములను, ఎదురుదెబ్బలను సైతం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటలో దుల్కర్ స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తన స్టైలిష్ వాయిస్‌తో ఈ పాటలోని ప్రతి లైన్‌ను ఎంతో జోష్‌తో పాడారు.

ఈ పాట విడుదల సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "జీవితంలో ఎదురయ్యే ఓటములను సైతం ఆస్వాదించే ధోరణి ఉన్న ఒక సరదా పాట ఇది. ఇలాంటి ట్రాక్‌ను నేనే స్వయంగా పాడడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో నేను ఒక బ్రౌన్ షేడ్స్ ఉన్న పోకిరి యువకుడి పాత్రలో కనిపిస్తాను. నా నిజజీవిత స్వభావానికి ఇది పూర్తి భిన్నమైన పాత్ర. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు నా పాత్ర బాగా నచ్చుతుందని భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.

ఈ క్రేజీ పాటకి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అద్భుతమైన స్వరాలను అందించారు. ఆయన కంపోజ్ చేసిన రిథమ్స్, హై-ఎనర్జీ బీట్స్ కు తగినట్లుగా దుల్కర్ పాడిన తీరు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి తోడు ర్యాప్ విభాగాలు కూడా తోడవడంతో యూత్‌ని ఈ సాంగ్ విపరీతంగా ఆకర్షిస్తోంది. యూట్యూబ్‌తో పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాట ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

'RDX' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కాతిర్ మరియు వినయ్ ఫోర్ట్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుపుకుంటున్న 'ఐ యామ్ గేమ్' సినిమాను సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

 

 

[Dulquer Salmaan, I Am Game Movie, Loser Song, Dulquer Singer, Jakes Bejoy Music]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com