Home

»

Latest News

Sathi Leelavathi: రెండు వారాలకే ఓటీటీలోకి మెగా కోడలు మూవీ!

May 18, 2026 4:48PM

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సతీ లీలావతి' (Sathi Leelavathi). మే 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ లవర్స్‌ను పలకరించేందుకు చాలా వేగంగా ఓటీటీ బాట పట్టింది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ, 'సతీ లీలావతి' చిత్రం మాత్రం థియేటర్స్ రిలీజ్ అయిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది.

నటి లావణ్య త్రిపాఠి కెరీర్‌లో ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'సతీ లీలావతి' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను Sun NXT సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా Sun NXT ప్రకటించింది. థియేటర్లలో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన ఈ మూవీ, ఓటీటీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

కథ ఏంటంటే..
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా డైరెక్టర్. లీలావతి కెరీర్‌తో బిజీగా ఉంటూ తనకు సమయం కేటాయించడం లేదని, విడాకులు కావాలని ఆమె భర్త రామ్ (దేవ్ మోహన్) కోరతాడు. అంతేకాకుండా తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి, అతన్ని ఇంట్లోనే కట్టేసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? రామ్ మనసు మారిందా? లీలావతి-రామ్ ఒక్కటయ్యారా లేదా? అనేదే మిగతా కథ.

Also Read: 'సతీ లీలావతి' మూవీ రివ్యూ

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com