Home

»

Latest News

‘బరాబర్‌ ప్రేమిస్తా..’ చిత్రం నుంచి ‘రెడ్డి మామ..’ సాంగ్‌ రిలీజ్‌!

Feb 22, 2025 1:46PM

ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్‌ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్‌ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్‌, ఎవిఆర్‌ మూవీ వండర్స్‌ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్‌ నిర్మిస్తున్నారు. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌ గా నటిస్తోంది. అర్జున్‌ మహీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్‌ బీట్‌ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు  రిలీజ్‌ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు. నకాష్‌ అజిజ్‌, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్‌ఆర్‌ ధృవణ్‌ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్‌ స్టంట్‌ చార్ట్‌ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్‌ రాజు మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. 

ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌, మేఘనా ముఖర్జీ, అర్జున్‌ మహి, మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ మీసాల, మధునందన్‌, అభయ్‌ నవీన్‌, రాజశేఖర అనింగి, డాక్టర్‌ భతిని, కీర్తిలతా గౌడ్‌, సునీత మనోహర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌ఆర్‌ ధ్రువన్‌, స్క్రీన్‌ప్లే: సంపత్‌ రుద్ర, ఎంఏ తిరుపతి, కథ: ఎంఏ తిరుపతి, డైలాగ్స్‌: రమేష్‌ రాయ్‌, డీవోపీ: వైఆర్‌ శేఖర్‌, ఎడిటర్‌ : బొంతల నాగేశ్వరరెడ్డి. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com