Home

»

Latest News

యాభై తొమ్మిది మందిని ఎందుకు చంపారో బయటపెడతాను

Oct 26, 2024 1:11PM

2014 లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచమైన భామ రాశి ఖన్నా(Raashii Khanna)ఆ తర్వాత ఎన్టీఆర్(ntr)రవితేజ(ravi teja)నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్,రామ్ పోతినేని, వరుణ్ తేజ్,గోపిచంద్ వంటి పలువురు హీరోలతో జత కట్టి ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని పొందింది.

ప్రస్తుతం హిందీలో ది సబర్మతి రిపోర్ట్(the sabarmati report)అనే సినిమా చేస్తుంది.ముంబైకర్,సెక్టార్ 36 ,బ్లాక్ అవుట్ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపుని పొందిన విక్రాంత్ మస్సే హీరోగా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం యొక్క టీజర్ రిలీజ్ అయ్యింది.దేశ చరిత్రని మార్చిన సంఘటన, భవిష్యత్తుని మార్చిన పరిణామాలు,సత్యాన్ని గగ్గోలు పెట్టిస్తూ భయపెట్టవచ్చు,కానీ ఓడించలేం అనే వ్యాఖ్యల్ని జోడించింది. రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో రాశి ఖన్నా మాట్లాడుతు ఈ మూవీలో నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్ట్ గా చేస్తున్నాను, రిలీజ్ అయ్యాక మరిన్ని విషయాలు మాట్లాడతానని చెప్పుకొచ్చింది.

2002 ఫ్రిబ్రవరి 27 న జరిగిన గుజరాత్ లోని గోద్రా(godra)రైలు ఘటనలో యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.ఆ సంఘటన అనుకోకుండా జరిగింది కాదని, దాని వెనుక ప్రపంచానికి తెలియని రహస్యాలని దర్శకుడు రంజన్ చందేల్(ranjan chandel)ది సబర్మతి రిపోర్ట్ ద్వారా చెప్పబోతున్నాడు.శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా వచ్చే నెల పదిహేను న విడుదల కాబోతుంది.


 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com