Home

»

Latest News

'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగిల్.. రా మచ్చా మచ్చా...

Sep 25, 2024 9:45AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదలకు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. (Game Changer second single)

థమన్ సంగీతం అందిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా 'జరగండి జరగండి' విడుదలైంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ లోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామని తెలుపుతూ ఇటీవల మేకర్స్ ఒక పోస్టర్ వదిలారు మేకర్స్. ఇక తాజాగా సాంగ్ నేమ్ ని రివీల్ చేశారు. ఈ సాంగ్ "రా మచ్చా మచ్చా" #RaaMachaMacha అంటూ సాగనుంది. ఈ సెకండ్ సింగల్ సెప్టెంబర్ 30న విడుదల కానుందని సమాచారం. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com