Home

»

Latest News

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'హరి హర వీరమల్లు' రిలీజ్ డేట్ వచ్చేసింది!

Sep 23, 2024 10:59AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టడంతో.. తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయలేకపోయారు. దీంతో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు షూటింగ్ దశలోనే ఉండిపోయాయి. అయితే ఆ సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, వాటిని పూర్తి చేయడానికి కొంత సమయం కేటాయిస్తానని చెప్పిన పవన్.. ముందుగా 'హరి హర వీరమల్లు' బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(సెప్టెంబర్ 23) ఉదయం విజయవాడలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను వదిలారు. 

'హరి హర వీరమల్లు' రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' గా రానుంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు కాగా, మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేసే బాధ్యతను యువ దర్శకుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com