Home

»

Latest News

సాంబార్ పిల్ల 'కుట్టి' ఎంత బాగుందో

Aug 4, 2024 11:38AM

బొద్దుగా ఉంటుంది కానీ మంచి క్యూట్ గా ఉంటుంది.. మంచి కామెడీ చేస్తుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ మూవీస్ లో నటిస్తూ మంచి కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ పాపులర్ కమెడియన్ విద్యు రామన్. ఐతే కొద్ది రోజుల క్రితం ఫిజిక్ మీద ఫోకస్ పెట్టి స్లిమ్ అయిపోయింది విద్య. తర్వాత కాలంలో తన న్యూట్రిషియనిస్ట్  సంజ‌య్‌తో విద్యు రామ‌న్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలాంటి విద్యు ఇప్పుడు ఒక కార్ కి ఓనరమ్మ అయ్యింది. "నా మొదటి ఎలక్ట్రిక్ కార్ ని కొన్నాను. సిటీ ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి..పార్కింగ్ తలనొప్పులకు దూరంగా ఉండడానికి ఇదే బెస్ట్ కార్ అని అనిపించింది. ఈ చిన్న కార్ ఎంతో బాగుంది. దాని పేరు “కుట్టి”. అంటూ ఆ కార్ తో పాటు వాళ్ళు ఫామిలీ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

ఇక నెటిజన్స్ అంతా కూడా విద్యు రామన్ కి విషెస్ చెప్తున్నారు. అలాగే విద్యురామన్ "నాట్ స్పాన్సర్డ్" అని ప్రత్యేకంగా హాష్ టాగ్ పెట్టి మరీ తన ఓన్ గా కొన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య ధర పలుకుతోంది. 2012లో 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విద్యు .. ఎన్నో మూవీస్ లో నటించింది. సరైనోడు మూవీలో సాంబార్ పిల్లగా అందరినీ అలరించింది. రన్ రాజా రన్‌ మూవీలో హీరోహీరోయిన్ కంటే విద్యు కామెడీ హైలైట్ గా ఉంటుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com