Home

»

Latest News

పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ ఐటమ్‌ సాంగ్‌!

Jul 23, 2024 8:17PM

బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా బాగా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఓ వైపు టీవీ షోలలో అలరిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లో కూడా మెరుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్ కమింగ్ మూవీలో సైతం చిందేసింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయనే రివీల్ చేసింది.

స్టార్ మా లో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' అనే షో ప్రసారమవుతోంది. ఇందులో శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించి కొత్త ప్రోమో విడుదలైంది. అందులో కంటెస్టెంట్ లు.. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫొటోని చూపించి గెస్ చేయమనగా.. అందరూ వెంటనే గుర్తుపట్టి "పవన్ కళ్యాణ్" అని గట్టిగా అరిచారు. ఆ సమయంలో అనసూయ ఎంతో సంతోషంగా ఒక విషయాన్ని రివీల్ చేసింది. "నేను మొదటిసారి ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను. చాలా గర్వంగా చెప్తున్నాను. నేను పవర్ స్టార్ తో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ చేశాను. ఆ పాట మాత్రం మోతమోగిపోతుంది." అని అనసూయ చెప్పుకొచ్చింది. 

పవన్ కళ్యాణ్ చేతిలో 'ఓజీ', 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉన్నాయి. వీటిలో 'ఓజీ' గ్యాంగ్ స్టర్ మూవీ కాగా, 'హరి హర వీరమల్లు' పీరియాడిక్ ఫిల్మ్. 'ఉస్తాద్ భగత్ సింగ్' కమర్షియల్ సినిమా కాబట్టి.. డ్యాన్స్ నెంబర్ ఉండే అవకాశముంది. ఈ లెక్కన ఈ మూవీలోనే అనసూయ స్పెషల్ సాంగ్ లో కనిపించే ఛాన్స్ ఉంది.

'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అప్పట్లో 'గబ్బర్ సింగ్'లోని 'కెవ్వు కేక' సాంగ్ ఎంతటి ఊపు ఊపిందో తెలిసిందే. ఇప్పుడు అనసూయ మాటలను బట్టి చుస్తే.. 'ఉస్తాద్ భగత్ సింగ్'లోని స్పెషల్ సాంగ్ కూడా ఒక ఊపు ఊపేలా ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com