Home

»

Latest News

జర్నలిస్ట్ కి తన సత్తా చాటి చెప్పిన కిరణ్ అబ్బవరం.. తోడేలు కాబట్టే పాన్ ఇండియా

Jul 15, 2024 4:06PM

 

సాధారణంగా జర్నలిస్ట్ ల  నుంచి హీరోలకి స్మూత్ గా కౌంటర్లు వస్తుంటాయి. దాంతో రెండు చేతులు ఫాంట్  జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి హీరోలకి వస్తుంటుంది. కానీ ఇప్పుడు రివర్స్ లో ఒక సినీ జర్నలిస్ట్ తన రెండు చేతులు ఫాంట్ జేబులో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి.

కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా  వరుసపెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నాడు. నిజానికి హిట్ తన తలుపు తట్టి చాలా కాలమే అవుతుంది. అయినా సరే మంచి రోజులు రాకపోతాయా అని పట్టువదలని విక్రమార్కుడులా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే క(ka)మూవీ చేస్తున్నాడు.  ఒకే  ఒక అక్షరంతో కూడిన భిన్నమైన మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పైగా కిరణ్ తన కెరీర్ లోనే చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్  రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా  మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ నేపధ్యంలో కిరణ్ తో ఒక  జర్నలిస్ట్ మాట్లాడుతు ఇప్పుడొస్తున్న చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చెయ్యటం లేదు. అసలు మీకు తెలుగులోనే చాలా సంవత్సరాల నుంచి హిట్ కూడా లేదు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్లో క  ని ఎలా విడుదల చేస్తారని అడిగాడు. దీనికి కిరణ్ సూపర్ గా సమాధానం ఇచ్చాడు.

 

పాన్ ఇండియా రేంజ్ అనేది కంటెంట్ ని బట్టి ఉంటుంది.ప్రెజంట్ నా స్థాయి ఏంటనేది నథింగ్. కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యం. మంజుమ్మేల్ బాయ్స్(manujummel boys)లో హీరో ఎవరని  హిట్ చేసారు. అలాగే కాంతారా(kantara)లో హీరో ఎవరని హిట్. వాటిల్లో  కంటెంట్ నే హీరో. అందుకే నా స్థాయి ఏంటనేది అనవసరం. క లో కంటెంట్ ఉంది కాబట్టే పాన్ ఇండియా లెవల్ కి వెళ్తున్నాం అని చెప్పుకొచ్చాడు. సుజిత్(sujith) అండ్ సందీప్(sandeep)అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. చింత గోపాల కృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. టీజర్ అయితే చాలా బాగుంది. క  మీద ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఒక కరుడు గట్టిన హంతకుడు తను ఎక్కడ నుంచి వచ్చాడో  తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కథ ఉంది. చివర్లో కిరణ్ ని తోడేలు అని సంబోధించడంతో డిఫరెంట్ కథ అని అర్ధం అవుతుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com