Home

»

Latest News

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్ళ తరువాత కలిశారు!

Jun 24, 2024 6:09PM

1996 లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. 28 ఏళ్ళ తరువాత తాజాగా ఈ ఇద్దరు కలిసిన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 28 ఏళ్ళ తరువాత కలిశారు" అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి తాజాగా నిర్మాతల బృందం పవన్ ని కలిశారు. వారిలో సుప్రియ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ తో సుప్రియ దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 28 ఏళ్ళ క్రితం ఒకే సినిమాతో ఈ ఇద్దరు హీరో హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగగా.. సుప్రియ నిర్మాతగా మారారు. 'అక్కడ అమ్మాయి' ప్రొడ్యూసర్ గా మారితే.. 'ఇక్కడ అబ్బాయి' డిప్యూటీ సీఎం అయ్యాడన్నమాట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com