Home

»

Latest News

హీరో జీవితం మొత్తాన్ని ఫేస్ బుక్ లో పెట్టిన దర్శకుడు

May 16, 2024 12:36PM

 

సిల్వర్ స్క్రీన్ మీద హీరో విలన్ కి షాక్ ఇవ్వాల్సిందే. ఇది రూల్. దీన్ని ఎవరు మార్చలేరు. హీరో చేత అదంతా చేయించేది    దర్శకుడు.కానీ ఒక  దర్శకుడు నిజ జీవితంలోనే   హీరోకి షాక్ ఇచ్చాడు. అది అలాంటి ఇలాంటి షాక్ కాదు. హీరో జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఫేస్ బుక్ లో పెట్టాడు 

 పాన్ ఇండియా సినీ యుగంలో పర భాషా నటులు సైతం  సొంత భాషా నటులుగా మారారు.  అలా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన  మలయాళ నటుడు  టోవినో థామస్(tovino thomas) రెండు వేళ పద్దెనిమిది మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన   మిన్నల్ మురళితో మంచి పేరుతో పాటు గుర్తింపుని పొందాడు. రెండు వేల  ఇరవై ఒకటవ సంవత్సరంలో మలయాళంలో  వజక్కు అనే మూవీలో హీరోగా చేసాడు. సనల్ కుమార్ శశిధరన్  దర్శకుడు. మూవీ  కంప్లీట్ కూడా అయ్యింది.  ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ కు వెళ్లాల్సిన టైంలో  థామస్, శశిధరన్ (Sasidharan)మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవలే సినిమాని ఫేస్ బుక్ పాలు చేసింది. థామస్ మీద కోపంతో  శశిధరన్ నే  ఫేస్ బుక్ లో షేర్ చేసాడు. విమియో అనే వీడియో అప్లోడింగ్ లో యూజర్లు ఉచితంగా చూసేలా అప్ లోడ్ చేసాడు.విషయం తెలిసి థామస్  ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. పైగా నిర్మాత కూడా  తనే

ఈ విషయం పైన థామస్ ని సంప్రదించగా  వజిక్కు  కోసం  ఇరవై ఏడు లక్షలు దాకా ఖర్చుపెట్టానని సినిమా విడుదల కాకపోవడానికి దర్శకుడే కారణమని చెప్పుకొచ్చాడు. మరో వైపు సినిమా బాగా రాలేదనే కారణంతోనే  థామస్ నే విడుదల కాకుండా  అడ్డుకున్నాడని సనల్ కుమార్ శశిధరన్ ఆరోపిస్తున్నాడు. కుని కుశృతి హీరోయిన్ గా  చేసిన ఈ చిత్రంలో సుదేవ్ నాయర్ , అజిస్ నేడుమంగడ్, బైజు నోటో, కీలక పాత్రలు పోషించారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తికి, భర్త నుంచి విడాకులు తీసుకున్న  మధ్య ఏర్పడిన అనుబంధం ఎటు వైపు దారి తీసిందనే పాయింట్ తో  వజక్కు  తెరకెక్కింది. వజిక్కు అంటే గొడవ

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com