Home

»

Latest News

దర్శకుల సంఘం ఎన్నికల్లో మెగా దర్శకుల హవా!

Feb 11, 2024 5:34PM

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో మెగా దర్శకులు సత్తా చాటారు. 'గుడుంబా శంకర్' ఫేమ్ వీరశంకర్ తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గా గెలుపొందగా.. 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ తో పాటు, చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని రూపొందిస్తున్న వశిష్ఠ వైస్ ప్రెసిడెంట్స్ గా ఎన్నికయ్యారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో మొత్తం 1113 ఓట్లు పోలయ్యాయి. ప్రెసిడెంట్ గా 232 ఓట్ల మెజారిటీ తో సముద్రపై వీర శంకర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్స్ గా 576 ఓట్లతో సాయి రాజేష్, 355 ఓట్లతో వశిష్ఠ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి(396) రెండు ఓట్ల మెజారిటీతో మద్దినేని రమేష్(394) పై గెలిచారు. జాయింట్ సెక్రటరీలుగా 436 ఓట్లతో వడ్డాణం రమేష్, 374 ఓట్లతో కస్తూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా ప్రియదర్శి, వంశీకృష్ణ.. ట్రెజరర్ గా పి.వి.రామారావు రావు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా కృష్ణ మోహన్, ఆకాష్, రాజా, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య, కూరపాటి రామారావు, లక్ష్మణ్ రావు, ప్రవీణ, రమణ, కొండా విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com