Home

»

Latest News

అప్పుడే ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'

Nov 1, 2023 6:38PM

నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. 11 రోజుల్లోనే ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.

'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా ఐదు వారాలకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట. ఓటీటీలోకి రావడానికి ఇంకా మూడు వారాల సమయముంది. మరి ఈలోపు 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com