Home

»

Latest News

మహేష్‌బాబుకి పెద్ద మైనస్‌ అయింది... మరి వేణు విషయంలో..!

Aug 30, 2023 1:18PM

స్వయంవరం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్‌ జంక్షన్‌, కళ్యాణరాముడు, ఖుషిఖుషీగా, పెళ్లాం ఊరెళితే వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించాడు. అతను నటించిన చివరి సినిమా రామాచారి. 2012లో ఈ సినిమా రిలీజ్‌ అయింది. 11 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించాడు వేణు. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘అతిథి’లో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టీజర్‌ వెబ్‌ సిరీస్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఓ మిస్టీరియస్‌ సబ్జెక్ట్‌తో ఈ సిరీస్‌ రూపొందినట్టు తెలుస్తోంది. గతంలో సూపర్‌స్టార్‌ మహేష్‌, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ‘అతిథి’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్‌ అయి మహేష్‌కి పెద్ద మైనస్‌ అయింది. ఇప్పుడు అదే పేరుతో వేణు చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ఏమేరకు ఆకట్టుకుంటుందో, వేణుకి ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి. సెప్టెంబర్‌ 19న డిస్నీ హాట్‌స్టార్‌లో ‘అతిథి’ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com