Home

»

Latest News

బ్రహ్మితో బన్ని భేటీ!.. ఇంతకీ మ్యాటరేంటి?

Aug 25, 2023 5:40PM

‘పుష్ప’ చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న స్టైలిష్‌ స్టార్‌ అర్జున్‌ ఆగస్ట్‌ 25న స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిశారు. గత వారం జరిగిన బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరు కాలేకపోయిన బన్ని గౌరవ పూర్వకంగా బ్రహ్మానందాన్ని కలుసుకున్నారు. అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు. దాదాపు గంటన్నర సేపు బ్రహ్మానందం నివాసంలో ఉన్నారు బన్ని. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌ను ఈ సందర్భంగా అభినందించారు బ్రహ్మానందం.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com