Home

»

Latest News

చంద్రకి కేక్ తినిపించిన నాగబాబు...విషెస్ చెప్పిన రచ్చ రవి

Dec 10, 2022 4:22PM

జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్. చిన్నచిన్న క్యారెక్టర్స్ తో మూవీస్ లో కూడా చేస్తూ  ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక అతని జీవితం మొత్తం మారిపోయింది. జబర్దస్త్‌తో వచ్చిన ఫేమ్‌ కారణంగా మూవీస్ లో మంచి మంచి రోల్స్ వస్తుండడంతో అక్కడ కూడా చేస్తూ  మంచి పేరు తెచ్చుకున్నాడు. లేడీ గెటప్ కి పెట్టింది పేరు చమ్మక్ చంద్ర.  ఇక  ఇప్పుడు చమ్మక్ చంద్ర తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నాడు. ఈ ఫంక్షన్ కి నాగబాబు వచ్చి కేక్ కట్ చేయించి చంద్రకి తినిపించారు.

అలాగే రచ్చ రవి, వేణు, ధన్ రాజ్, అవినాష్, మిమిక్రి శివారెడ్డి ఇలా ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు. "చమ్మక్ చంద్రుడికి ఈ రచ్చ తరఫున.. మనల్ని ప్రేమించి ఆశీర్వదించిన జబర్దస్త్, సినిమా ప్రేక్షకుల అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు" అని చెప్పాడు. ఇక చమ్మక్ చంద్రతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్టేటస్ లో పెట్టుకున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com