Home

»

Latest News

క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియ‌న్ 2' షూటింగ్ ఆగ‌స్ట్‌లో రిస్టార్ట్ అవుతుందా?

Jul 6, 2022 11:48AM

 

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ రూపొందించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'విక్ర‌మ్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 400 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమా స‌క్సెస్‌తో ఊపు మీదున్న క‌మ‌ల్.. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న 'ఇండియ‌న్ 2' మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వ‌ర‌లో రిస్టార్ట్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని బిగ్గెస్ట్ పాన్‌-ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో 'ఇండియ‌న్' (భార‌తీయుడు) ఒక‌టి. శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా క‌మ‌ల్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా, ఎ.ఆర్‌. రెహ‌మాన్ మ్యూజిక్ స‌మ‌కూర్చారు. 

దానికి సీక్వెల్ తీయాల‌నే సంక‌ల్పంతో క‌మ‌ల్‌, శంక‌ర్ 'ఇండియ‌న్ 2' ప్రాజెక్టుకు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో అసోసియేట్ అయ్యారు. అయితే షూటింగ్ జ‌రుగుతుండ‌గా క్రేన్ యాక్సిడెంట్ అవ‌డం, ఆ త‌ర్వాత కొవిడ్ రావ‌డంతో, షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. క్రేన్ యాక్సిడెంట్ వివాదాస్ప‌దం కావ‌డం, ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య పొర‌పొచ్చాలు రావ‌డం కూడా షూటింగ్ వాయిదాప‌డ‌టానికి మ‌రో కార‌ణం.

కాగా, శంక‌ర్ ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో 'RC15'ను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక 'ఇండియ‌న్ 2'ను ఆయ‌న పునఃప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ ద్వితీయార్ధంలో 'ఇండియ‌న్ 2' షూటింగ్ రిస్టార్ట్ అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు.

'ఇండియ‌న్ 2' షూటింగ్ మొద‌లు పెట్టిన‌ప్పుడు ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు, సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ ల‌ను కీల‌క పాత్ర‌ల‌కు తీసుకున్నారు. ఇప్పుడు ఈ తారాగ‌ణంలో మార్పేమైనా జ‌రుగుతుందా అనేది వేచి చూడాలి. అంతే కాకుండా ఇప్ప‌టికే ఈ సినిమా కోసం కొన్ని సీన్లలో న‌టించిన వివేక్‌, నెడిముడి వేణు ఇప్పుడు లేరు. వాళ్ల స్థానాల్లో వేరే న‌టుల్ని తీసుకోక త‌ప్ప‌దు. ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com