Home

»

Latest News

విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర్సెస్ రాఘ‌వ లారెన్స్!

Jul 4, 2022 1:43PM


యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌ల్టిటాలెంటెడ్ లారెన్స్ రాఘ‌వ.. ఒకే రోజున  బాక్సాఫీస్ వార్ కి సిద్ధ‌మ‌య్యారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `నిన్ను కోరి`, `మ‌జిలీ` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా `ఖుషి`. చెన్నై పొన్ను స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జ‌య‌రామ్, ముర‌ళీ శ‌ర్మ‌, స‌చిన్ ఖేద్క‌ర్, ల‌క్ష్మి, రోహిణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో `ఖుషి` జ‌నం ముందుకు రాబోతోంది.

క‌ట్ చేస్తే.. అదే డిసెంబ‌ర్ 23న లారెన్స్ రాఘ‌వ కొత్త చిత్రం కూడా రిలీజ్ కానుంది. తెలుగులో `రుద్రుడు`, త‌మిళంలో `రుద్ర‌న్`, క‌న్న‌డంలో `న‌మ్మ రుద్ర‌` పేరుతో వినోదాలు పంచ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని క‌తిరేశన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నాడు. ఇందులో లారెన్స్ కి జంట‌గా ప్రియా భ‌వాని శంక‌ర్ క‌నిపించ‌నుండ‌గా శ‌ర‌త్ కుమార్, పూర్ణిమ భాగ్య‌రాజ్, నాజ‌ర్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌రి.. ఒకే రోజున రాబోతున్న ఈ చిత్రాల‌తో విజ‌య్, లారెన్స్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com