Home

»

Latest News

గోపీచంద్ కి పోటీగా 'జార్జ్ రెడ్డి' హీరో

Jun 5, 2022 4:23PM

'వంగవీటి', 'జార్జ్ రెడ్డి' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ మాధవ్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

'గంధర్వ' సినిమాని జూలై 1న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అదే రోజున గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్' విడుదల కానుండడం విశేషం. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

జూలై 1వ తేదీన వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా కూడా విడుదల కానుంది. 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన 'ఆదిత్య వర్మ' డైరెక్టర్ గిరీశయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పోటీకి రెడీ అవుతున్న 'గంధర్వ'కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com