Home

»

Latest News

ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ ట‌చ్ వున్న యాక్ష‌న్ కామెడీ చేశాను!

May 19, 2022 4:55PM

 

ఇప్ప‌టివ‌ర‌కూ కామెడీ సినిమాల‌తో, స్పూఫ్‌ల‌తో తెగ‌న‌వ్వించిన సంపూర్ణేశ్ బాబు తొలిసారిగా హార‌ర్ మేళ‌వించిన యాక్ష‌న్ కామెడీ సినిమాతో మ‌న‌ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా.. రేపు (మే 20) విడుద‌ల‌వుతోన్న 'ధ‌గ‌డ్ సాంబ'. ఎన్‌.ఆర్‌. రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌వీణ క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై ఆర్‌.ఆర్‌.బి.హెచ్‌. శ్రీ‌నుకుమార్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక చిన్న స‌మ‌స్య వ‌ల్ల చిన్న‌ప్పుడే త‌న ఆస్తినంతా కోల్పోయిన హీరో, తిరిగి త‌న ఆస్తిని సంపాదించుకోవ‌డానికి 'ధ‌గ‌డ్ సాంబ‌'గా ఎలా మారాడ‌నేది ప్ర‌ధానాంశ‌మ‌ని మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపాడు సంపూర్ణేశ్‌.

"ఇంత‌దాకా రిలీజైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ లభించింది. ఇంత‌కు ముందు వ‌చ్చిన బ‌జార్ రౌడి, క్యాలీ ఫ్ల‌వ‌ర్ మూవీలు నేను ఆశించిన రీతిలో ఆడ‌లేదు. 'ధ‌గ‌డ్ సాంబ' క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాను" అని ఆయ‌న చెప్పాడు. ఫుల్ ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు సినిమాలో హార‌ర్ ట‌చ్ ఉంద‌నీ, ఇప్ప‌టిదాకా ఈ త‌ర‌హా స‌బ్జెక్ట్ త‌ను చేయ‌లేద‌నీ అన్నాడు.

"ఇప్పటివరకు నేను ఎక్కువగా కామెడీ రోల్ లో నటించాను. ఇందులో మొదటి సాటి హర్రర్ వైపు అంటే సీరియస్ గా వుండే డిఫ‌రెంట్‌ సబ్జెక్ట్ చేశాను. 'కొబ్బరి మట్ట', 'సింగం 123' వంటి సినిమాల్లో ఎక్కువగా స్పూఫ్స్ ఉన్నాయి. అలాంటి స్పూఫ్స్ ఇందులో ఉండ‌వు. డైలాగ్స్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటాయి." అని చెప్పాడు సంపూర్ణేశ్ బాబు. 

'కొబ్బరిమట్ట' తర్వాత కొన్ని పెద్ద బ్యానర్స్ లో సినిమా అవకాశాలు వచ్చినా కొన్ని కారణాలు వలన అవి పోస్ట‌ఫోన్‌ అయ్యాయని ఆయ‌న తెలిపాడు. "ఇంతలో దర్శకుడు.యన్.ఆర్. రెడ్డి చెప్పిన క‌థ‌ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ మరియు ఎన్నో.. ట్విస్ట్ టర్న్స్ తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. నాలుగు ఫైట్స్ ను నలుగురు ఫైట్ మాస్టర్స్ తో చేయడం చాలా సంతోషంగా ఉంది." అని వెల్ల‌డించాడు సంపూర్ణేశ్‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com