Home

»

Latest News

మ్యూజిక‌ల్ హిట్ `ఆర్య 2`కి ప‌న్నెండేళ్ళు!

Nov 27, 2021 2:55PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కొత్త కోణంలో ఆవిష్క‌రించే ద‌ర్శ‌కుల్లో బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మొద‌టి సినిమా `ఆర్య‌`(2004).. ఇరువురికీ ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆపై బ‌న్నీ, సుక్కు కాంబోలో వ‌చ్చిన `ఆర్య 2` ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయినా.. `ఆర్య‌`లాగే మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. `ఆర్య‌`కి స్వ‌రాలు స‌మ‌కూర్చిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ నే `ఆర్య 2`కి కూడా బాణీలు అందించాడు. చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ ఆల్బ‌మ్ లో ``మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్``, ``ఉప్పెనంత‌``, ``బేబీ హీ ల‌వ్స్ యూ``, ``క‌రిగేలోగా``, ``మై ల‌వ్ ఈజ్ గాన్``, ``రింగ రింగ‌``.. ఇలా ప్ర‌తీ పాట యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది.

``ల‌వ్ - హేట్ రిలేష‌న్ షిప్`` చుట్టూ అల్లుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్, న‌వ‌దీప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. అజ‌య్, బ్ర‌హ్మానందం, శ్ర‌ద్ధా దాస్, ముకేశ్ రిషి, సాయాజీ షిండే, వేణుమాధ‌వ్, శ్రీ‌నివాస రెడ్డి, కృష్ణుడు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. ఎరీనా ఆండ్రియానా ప్ర‌త్యేక గీతం (``రింగ రింగ‌``)లో త‌న‌ చిందులతో క‌నువిందు చేసింది. ఆదిత్య ఆర్ట్స్ ప‌తాకంపై ఆదిత్య బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2009 న‌వంబ‌ర్ 27న విడుద‌లై మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచిన‌ `ఆర్య 2`.. నేటితో పుష్క‌ర‌కాలం పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com