Home

»

Latest News

నాగ్‌కి అచ్చిరాని తేదిన‌ అఖిల్ `బ్యాచ్ ల‌ర్`!

Sep 27, 2021 11:03AM

`అఖిల్`, `హలో`, `మిస్ట‌ర్ మ‌జ్ను`.. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించాడు అక్కినేని బుల్లోడు అఖిల్. వీటిలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ స్టేట‌స్ కి చేరుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 8న ఈ సినిమా విడుద‌ల కాబోతున్న‌ట్లు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. క‌ట్ చేస్తే.. అక్టోబ‌ర్ 15కి ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వాయిదా ప‌డింది. తాజాగా ఈ విష‌యాన్ని అనౌన్స్ చేసింది యూనిట్.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ఇదే అక్టోబ‌ర్ 15న అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున న‌టించిన `రావోయి చంద‌మామ‌` (1999) విడుద‌లైంది. మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది. మ‌రి.. 22 ఏళ్ళ అనంత‌రం నాగ్ కి అచ్చిరాని తేదిన‌ వ‌స్తున్న అఖిల్ అయినా స‌క్సెస్ ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

కాగా, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`లో అఖిల్ జోడీగా పూజా హెగ్డే న‌టించ‌గా.. `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గోపీసుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com