Home

»

Latest News

విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆహాలో 'సూపర్‌ డీలక్స్‌'

Jul 27, 2021 9:35PM

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఇప్పటికే పలు భాషలకు చెందిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసింది. ఇటీవల విజయ్‌ సేతుపతి నటించిన తమిళ చిత్రం 'సంఘతమిజన్‌'ను 'విజయ్‌ సేతుపతి' అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా సేతుపతి నటించిన మరో హిట్‌ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

విజయ్‌ సేతుపతి, సమంత, ఫహద్‌ ఫాజిల్‌, రమ్యకష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'. 2019లో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటించిన తీరుకి చప్పట్ల వర్షం కురిసింది. ఇక మూవీలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో నటించగా.. సమంత, ఫాజిల్ భార్యభర్తలుగా నటించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. 'సూపర్‌ డీలక్స్‌' తెలుగు డబ్బింగ్‌ వెర్షన్ ను ఆగస్టు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు పేర్కొంది. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com