Home

»

Latest News

ఏడాదిలోపే ఓటీటీలో ఫాహ‌ద్ నాలుగు చిత్రాలు!

Jul 10, 2021 2:24PM

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ద‌క్కించుకున్నాడు ఫాహ‌ద్ ఫాజిల్. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడిగా 2002లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫాహ‌ద్.. మాలీవుడ్ లో క్ర‌మేణా స్టార్ డ‌మ్ చూశాడు. వైవిధ్యం అంటే ఫాహ‌ద్.. ఫాహద్ అంటే వైవిధ్యం.. అన్న‌ట్లుగా పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ భారీ అభిమాన‌గ‌ణాన్నే సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. క‌రోనా టైమ్ లో ఏడాది తిరిగేస‌రికి ఓటీటీలో నాలుగు చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తూ.. టాక్ ఆఫ్ మాలీవుడ్ అవుతున్నారు ఫాహ‌ద్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 1న ఐఫోన్ లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న కంప్యూట‌ర్ స్క్రీన్ ఫిల్మ్ `సీ యూ సూన్`తో అమెజాన్ ప్రైమ్ లో సంద‌డి చేసిన ఫాహ‌ద్.. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్ 2న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `ఇరుళ్` (నెట్ ఫ్లిక్స్ రిలీజ్), ఏప్రిల్ 7న క్రైమ్ డ్రామా `జోజీ` (అమెజాన్ ప్రైమ్)తో ఓటీటీ వేదిక‌ల్లో ప‌ల‌క‌రించారు. ఈ మూడు సినిమాలు కూడా వీక్ష‌కాద‌ర‌ణ పొందాయి. క‌ట్ చేస్తే.. ఈ జూలై 15న క్రైమ్ థ్రిల్ల‌ర్ `మాలిక్`తో అమెజాన్ ప్రైమ్ ముంగిట మ‌రోమారు ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు ఫాహ‌ద్ ఫాజిల్.

మొత్త‌మ్మీద‌.. ఏడాది వ్య‌వ‌ధిలో నాలుగు డిఫ‌రెట్ జోన‌ర్ ఫిల్మ్స్ తో ఓటీటీలోనే ప‌ల‌క‌రించి ఫాహ‌ద్ ఫాజిల్ వార్త‌ల్లో నిలిచారు. మ‌రి.. గ‌త మూడు ఓటీటీ రిలీజ్ చిత్రాల్లాగే `మాలిక్` కూడా సినీ ప్రియుల‌ను అల‌రిస్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com