Home

»

Latest News

అల్లు స్నేహారెడ్డి ఏరియ‌ల్ యోగా.. కామెంట్ చేసిన చిరంజీవి చిన్న‌ల్లుడు!

Jul 9, 2021 4:53PM

 

పిల్లలు అయాన్‌, అర్హ ఫొటోల‌ను, వీడియోలను తరచూ పంచుకునే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి రోజూ ఉద‌యం త‌ను చేసే ప‌ని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సంగ్రహావలోకనం ఇచ్చారు. స్నేహ ఇటీవలి కాలంలో యోగాను ప్రాక్టీస్ చేస్తూ వ‌స్తున్నారు. గురువారం ఆమె తన ఏరియ‌ల్‌ యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేశారు. ఆమెకు ఉత్సాహం క‌లిగించేలా చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ ఓ స్వీట్ కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

అల్లు స్నేహారెడ్డి తన పిల్లలు అర్హ, అయాన్ వారి తండ్రి అల్లు అర్జున్‌తో కలిసి గడిపే చూడ‌ముచ్చ‌టైన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు. స్నేహ తన రోజును ఎలా ప్రారంభిస్తుందో తెలియ‌జేయ‌డానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. ఎప్పుడూ యోగా సాధన చేస్తూ వ‌స్తున్న ఆ ఇద్దరు పిల్ల‌ల‌ తల్లి, మార్పు కోసం ఏరియ‌ల్‌ యోగాను సాధ‌న చేయ‌డానికి ప్రయత్నించారు. దానికి సంబంధించిన ఫొటోను పంచుకుంటూ, "ప్రపంచాన్ని తలక్రిందులుగా చూస్తున్నాను." అంటూ రాశారు స్నేహ‌.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ ఆమెను ఉత్సాహపరిచేందుకు స్నేహ పోస్ట్‌పై “వూహూ, చివరకు స్నేహ! (sic).” అంటూ కామెంట్ చేయ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. కేవ‌లం క‌ల్యాణ్ దేవ్ మాత్ర‌మే కాదు, స్నేహారెడ్డి కొత్త అవ‌తారాన్ని ఫ్యాన్స్ కూడా బాగా ఇష్ట‌ప‌డుతున్నారు.

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి తొలిసారి ఒక ఫ్రెండ్ పెళ్లి వేడుక‌లో క‌లుసుకున్నారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించేశాడు బ‌న్నీ. కొంత‌కాలం ఫోన్ల‌లో మాట్లాడుకొని, ప్రేమించుకున్నాక 2011 మార్చి 6న పెళ్లి చేసుకున్నారు. 2014లో అయాన్‌, 2016లో అర్హ పుట్టారు. ఇటీవ‌ల ఆ ఇద్ద‌రూ 10వ పెళ్లిరోజు సెల‌బ్రేట్ చేసుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com