Home

»

Latest News

రవితేజ68 అప్‌డేట్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే?

Jul 1, 2021 12:10PM

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ అందుకొని జోరు మీదున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా చేస్తున్న రవితేజ.. శ‌ర‌త్ మండ‌వ‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నేటి(జూలై 1) నుంచి చిత్రీరకణ పారంభం అయింది. 

రవితేజ 68వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈరోజు(గురువారం) నుంచి షూటింగ్ ప్రారంభమైందని తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో 'తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం'లో పనిచేసే ఉద్యోగిగా రవితేజ కనిపిస్తున్నాడు. 

ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని తెలుస్తోంది. పాత్రకి తగ్గట్టే సినిమాకి 'ఎమ్మార్వో' అనే టైటిల్ పెట్టాలని చిత్రం బృందం ఆలోచనలో ఉందని సమాచారం. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఆర్‌టి టీమ్ వర్కస్ బ్యానర్స్‌ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com